హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు..
ABN, Publish Date - Sep 08 , 2024 | 02:08 PM
నగరంలో హైడ్రా(HYDRA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఇందు కోసం 30టీమ్స్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దింపారు.
హైదరాబాద్: నగరంలో హైడ్రా(HYDRA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఇందు కోసం 30టీమ్స్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దింపారు. దుండిగల్, మాదాపూర్, మియాపూర్, బోరబండ, స్వర్ణపురిలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఆక్రమించి కట్టిన లక్ష్మీ శ్రీనివాస్ కన్‌స్ట్రక్షన్స్‌లో నిర్మించిన విల్లాల కూల్చివేత కొనసాగుతోంది. మాదాపూర్ సున్నం చెరువు బఫర్ జోన్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
Read LatestAP NewsandTelugu News
Read LatestTelangana NewsandNational News
Read LatestChitrajyothy NewsandSports News
Updated at - Sep 08 , 2024 | 02:14 PM