పెరగనున్న చార్జీలు..రిజిస్ట్రేషన్ ఆఫీస్ లకు పోటెత్తిన జనం

ABN, Publish Date - Dec 27 , 2024 | 09:30 PM

ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఛార్జీల ప్రతిపాదనలు అధికారులు.. ప్రభుత్వం ముందు ఉంచారు. వచ్చే ఏడాది అంటే... జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు చేయాలని భావిస్తున్నప్పటికి.. విధి విధానాలపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఛార్జీల ప్రతిపాదనలు అధికారులు.. ప్రభుత్వం ముందు ఉంచారు. వచ్చే ఏడాది అంటే... జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు చేయాలని భావిస్తున్నప్పటికి.. విధి విధానాలపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. దాంతో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెరుగుదల ఎప్పటి నుంచి అనేది తెలియక పోయినప్పటికీ.. ఈ ఛార్జీల పెంపు మాత్రం ఖాయమైంది.


ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలన్నీ దాదాపుగా జనంతో నిండిపోయాయి. ఆస్తుల విక్రయాలు, క్రయ విక్రయాల కోసం భారీగా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద భారీగా కోలాహలం నెలకొంది. సాధారణ దినాలతో పోలిస్తే.. రెట్టింపు సంఖ్యలో ఈ రోజు.. రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 27 , 2024 | 09:30 PM