అడ్డంగా బుక్కైన తమ్మినేని సీతారాం

ABN, Publish Date - Oct 23 , 2024 | 09:49 AM

అమరావతి: మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం టెండర్ల వ్యవహారంలో ఇరుక్కున్నారు. ఆయన హయాంలో అసెంబ్లీలో ఒక పనికి పిలిచిన టెండర్లలో తక్కువకు కోట్‌ చేసిన వారిని కాదని.. తమకు కావలసిన వారికి దక్కేలా ప్రభావితం చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

అమరావతి: మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం టెండర్ల వ్యవహారంలో ఇరుక్కున్నారు. ఆయన హయాంలో అసెంబ్లీలో ఒక పనికి పిలిచిన టెండర్లలో తక్కువకు కోట్‌ చేసిన వారిని కాదని.. తమకు కావలసిన వారికి దక్కేలా ప్రభావితం చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తక్కువ రేటుకు టెండర్‌ వేసిన కంపెనీని పక్కకు తప్పించడానికి చిన్న చిన్న కారణాలు చూపుతూ ఆయన స్వయంగా ఫైలుపై రాసి సంతకం కూడా చేసినట్లు సమాచారం. రేటు ఎక్కువ వేసినా.. నాటి సీఎం జగన్‌ కుటుంబ మీడియా కార్యాలయంలో సీసీ కెమేరాల నిర్వహణ చూస్తున్న సంస్థకు ఈ టెండర్‌ లభించడం విశేషం.


టీడీపీ హయాంలో వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో జర్మన్‌ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో మైకులు, డిజిటల్‌ ఆడియో సిస్టం ఏర్పాటు చేశారు. దీనిని మొదట సీఆర్‌డీఏ ఏర్పాటు చేయించి మూడేళ్లపాటు దాని నిర్వహణ చూసింది. ఆ గడువు ముగిసే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆడియో సిస్టం నిర్వహణ కోసం 2020 అక్టోబరులో టెండర్లు పిలిచారు. ఇందులో రెండు సంస్థలు సాంకేతిక అర్హత సాధించాయి. ఇందులో ఒకటి అట్లూరి అండ్‌ కో కాగా.. మరొకటి స్వస్తిక్‌ కమ్యూనికేషన్స్‌. అట్లూరి సంస్థ ఉమ్మడి రాష్ట్రంలో చాలాకాలం అసెంబ్లీ ఆడియో సిస్టం నిర్వహణ చేపట్టింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కూడా నిర్వహణ అదే చూస్తోంది. స్వస్తిక్‌ కమ్యూనికేషన్స్‌ ప్రధానంగా సీసీ కెమేరాలు, ఇంటర్‌ కమ్‌ ఫోన్లకు సంబంధించిన నిర్వహణ చూస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌ సీసీ కెమేరాల నిర్వహణ ఈ సంస్థే చూస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి..

క్షమాపణలు చెప్పను: ఉదయనిధి స్టాలిన్

కేటీఆర్ స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న కోర్టు..

పోలీసులతో నిందితుడికి సంబంధాలపై విచారణ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నేడు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 23 , 2024 | 09:49 AM