వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రికి అరెస్ట్ భయం
ABN, Publish Date - Dec 10 , 2024 | 08:26 AM
నెల్లూరు: వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు కూటమి ప్రభుత్వం భయం పట్టుకుంది. అధికారంలో ఉండగా చేసిన తప్పులను బయటపెట్టి అరెస్టు చేస్తారేమోనని వణికిపోతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకానీని కలిసి అనిల్ ఒకింత వేదాంత దోరణిపై మాడ్లాడడంపై అందరికీ అనుమానం వస్తోంది.
నెల్లూరు: వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు కూటమి ప్రభుత్వం భయం పట్టుకుంది. అధికారంలో ఉండగా చేసిన తప్పులను బయటపెట్టి అరెస్టు చేస్తారేమోనని వణికిపోతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకానీని కలిసి అనిల్ ఒకింత వేదాంత దోరణిపై మాడ్లాడడంపై అందరికీ అనుమానం వస్తోంది. ఈ మాజీ మంత్రి మాటల్లోనే విషయం అర్థమైంది. పార్టీ అధినేత జగన్‌కు వీర విధేయుడు. ఇప్పటికీ తాను వైఎస్సార్‌సీపీ కాదు అన్న విధంగా మాట్లాడతారు. తనది జగన్ పార్టీ అంటారు.
అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయడంతో ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూసే అవకాశం లేదు. జగన్ పరిస్థితి ఏమో ఘోరంగా ఉంది. ఎప్పుడు ఏ జైలుకు వెళతారో అర్థంకాని పరిస్థితి. ఒకవేళ జగన్ జైలుకు వెళ్లి.. వైఎస్సార్‌సీపీ పగ్గాలు ఇతరుల చేతికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తనది జగన్ పార్టీ అంటున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ చివరికి వైఎస్సార్‌సీపీకి దూరమయ్యేలా ఉన్నారనే చర్చ సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ ఏమన్నారంటే..
పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 10 , 2024 | 08:26 AM