KCR: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ.. కేసీఆర్ రియాక్షన్..
ABN, Publish Date - Oct 28 , 2024 | 02:45 PM
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ ఘటనపై డీజీపీ జితేంద్రకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఫోన్ చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో ఎలా తనిఖీలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ (Janwada Farm House Party) ఘటనపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) స్పందించారు. రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలపై డీజీపీ జితేంద్రకు కేసీఆర్ ఫోన్ చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తున్నారు?, తక్షణమే సోదాలు ఆపేయాలని డీజీపీని కోరారు. ఇక విచారణలో భాగంగా విజయ్ మద్దూరి నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. రాజ్ పాకాల కంపెనీలో విజయ్ మద్దూరి సీఈవోగా పని చేస్తున్నారు. కొత్త ఫామ్ హౌస్‌లో దీపావళి సందర్భంగా పార్టీ కోసం విజయ్‌ను రాజ్ పాకాల పిలిచారు. పార్టీలో రాజ్ పాకాల వద్ద నుంచి తాను కొకైన్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో విజయ్ అంగీకరించారు. కేటీఆర్ బావమరిది ఆఫర్ చేస్తేనే తాను కొకైన్ తీసుకున్నట్లు స్టేట్మెంట్‌లో తెలిపారు. మోకిల పోలీసులకు ఇచ్చిన విజయ్ స్టేట్మెంట్ ఈ కేసులో కీలకంగా మారింది. ఈ కేసులో ఏ1గా రాజ్ పాకాల, ఏ2గా విజయ్ మద్దూరిని పోలీసులు చేర్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ హయాంలో భారీ స్కాం: జనసేన
రాజ్ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు
సత్తెనపల్లిలో హై టెన్షన్.. టీడీపీ vs వైసీపీ..
అది జగన్ చేతకానితనానికి నిదర్శనం: షర్మిల
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 09 , 2024 | 10:00 PM