బ్యాంకు దోపిడీకి విఫలయత్నం..

ABN, Publish Date - Dec 18 , 2024 | 12:32 PM

తిరుపతి: నగరంలో బ్యాంక్‌లో దోపిడీకి ప్రయత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. తిరుపతి, రేణిగుంట రోడ్డులోని ఇండియన్ బ్యాంక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

తిరుపతి: నగరంలో బ్యాంక్‌లో దోపిడీకి ప్రయత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. తిరుపతి, రేణిగుంట రోడ్డులోని ఇండియన్ బ్యాంక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న (మంగళవారం) సాయంత్రం బ్యాంకు మూసివేసే సమయంలో ఓ యువకుడు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని, బ్యాగ్‌లో కత్తి పెట్టుకుని బ్యాంక్‌కు వచ్చాడు. క్యాషియర్ పక్కన ఉన్న అకౌంటెంట్ మెడపై కత్తిపెట్టి డబ్బులు బ్యాగ్‌లో వేయాలని బెదిరించాడు. అదే సమయంలో బ్యాంక్‌కు వచ్చిన ఖాతాదారులు ఆ యువకుడిని మాటల్లో దింపి చాకచక్యంగా పట్టుకున్నారు. బయటకు తీసుకు వచ్చి.. గ్రిల్‌కు కట్టేసి చితకబాదారు. తాను రూ. 5 లక్షలు అప్పు చేశారని, ఆ బాధ తట్టుకోలేక చోరీకి వచ్చినట్లు నిందితుడు చెప్పాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది

శిల్పా రవిపై రెచ్చి పోయిన పుష్పా ఫ్యాన్స్

హైదరాబాద్‌లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..

నకరేకల్లు డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

బీఆర్ఎస్ నేతలు రోజుకో వేషం..

గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వెలుగులోకి కొత్త నిజాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 18 , 2024 | 12:32 PM