Over Migrants: నో ఎంట్రీ..ట్రంప్ బాటలోనే యూరప్

ABN, Publish Date - Dec 27 , 2024 | 10:09 PM

Over Migrants: యూరోపియన్ దేశాలు కూడా వలసలకు నో చెప్పేస్తున్నాయా..? ట్రంప్ బాటలోనే యూరోపియన్ దేశాధినేతలు పయనిస్తున్నారా...? సిరియా, సోమాలియా, సూడాన్ లాంటి కల్లోల ప్రాంతాల నుంచి కూడా శరణార్థులను రానీవ్వకపోతే వారు ఎటూ పోవాలి..? ఒకప్పుడు వలసదారులను, శరణార్థులను అక్కున చేర్చుకున్న దేశాలు ఇప్పుడు ఎందుకు ముఖం చాటేస్తున్నాయి.

యూరోపియన్ దేశాలు కూడా వలసలకు నో చెప్పేస్తున్నాయా..? ట్రంప్ బాటలోనే యూరోపియన్ దేశాధినేతలు పయనిస్తున్నారా...? సిరియా, సోమాలియా, సూడాన్ లాంటి కల్లోల ప్రాంతాల నుంచి కూడా శరణార్థులను రానీవ్వకపోతే వారు ఎటూ పోవాలి..? ఒకప్పుడు వలసదారులను, శరణార్థులను అక్కున చేర్చుకున్న దేశాలు ఇప్పుడు ఎందుకు ముఖం చాటేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వలసలు పెరిగిపోతున్నాయి. అమెరికా తర్వాత అత్యధికంగా వెళ్లేది యూరప్‌కే. సిరియా, లెబనాన్, సోమాలియా, సూడాన్ లాంటి కల్లోల దేశాల నుంచి ప్రతి ఏడాది లక్షలాది మంది యూరోపియన్ దేశాలకు వచ్చి తలదాచుకుంటున్నారు.


వారిని జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్ వంటి యూరోపియన్ దేశాలు అక్కున చేర్చుకుని ఆశ్రయమిస్తుంటాయి. ఇది ప్రతి ఏడాది జరిగేదే. 2015లో సిరియాలాంటి కల్లోల దేశాల నుంచి 13 లక్షల మంది వచ్చి యూరప్‌లో స్థిరపడ్డారు. వీరంతా శరణార్థులుగా కట్టుబట్టలతో తమ దేశాల నుంచి పారిపోయి వచ్చారు. అప్పటి జర్మనీ దేశ అధ్యక్షురాలు ఎంజెలా మర్కెల్ వారందరినీ తమ దేశంలోకి రానీచ్చారు. తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ దశాబ్ధంలో యూరోపియన్ దేశాల్లో చాలా మార్పు వచ్చింది. అసలు వలసదారులు, శరణార్థులు తమ దేశాలకు రావొద్దంటూ యూరప్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో రైట్ వింగ్ బాగా రైజ్ అయింది. దాదాపు అన్ని దేశాలు కూడా డోనాల్డ్ ట్రంప్ తరహాలోనే ఆలోచిస్తున్నాయి. జర్మనీ బోర్డర్లను మూసేసింది. ఎక్కడికక్కడ చెక్ పెట్టింది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాల్లో ఉండే కఠినమైన వలస చట్టాలను తీసుకురానున్నాయి.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 27 , 2024 | 10:30 PM