మనల్ని షేక్ చేసేవాడు లేడు: డీఎస్పీ

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:06 AM

హైదరాబాద్: దేవిశ్రీ ప్రసాద్‌ (డీఎస్‌పీ) ను అందరూ దూరం పెడుతున్నారా.. పుష్పా2 ఐటమ్ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్‌కు కోపం వచ్చిందా.. అందుకే రాక్‌స్టార్‌ అలా మాట్లాడారా.. వివరాల్లోకి వెళితే.. పుష్పా2 ఐటమ్ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.

హైదరాబాద్: దేవిశ్రీ ప్రసాద్‌ (డీఎస్‌పీ) ను అందరూ దూరం పెడుతున్నారా.. పుష్పా2 ఐటమ్ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్‌కు కోపం వచ్చిందా.. అందుకే రాక్‌స్టార్‌ అలా మాట్లాడారా.. వివరాల్లోకి వెళితే.. పుష్పా2 ఐటమ్ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. మనం ఎంత ఎదిగినా ఫ్యాన్స్ తోడుంటే మనల్ని షేక్ చేసేవాడు ఉండడంటూ దేవిశ్రీ ప్రసాద్ ఒకింత కసిగా మాట్లాడారు. అంతేకాదు మనకేం కావాలో మనం అడిగి తీసుకోవాలని.. స్క్రీన్ మీద వచ్చే క్రెడిట్ అయినా.. ప్రొడ్యూసర్ ఇచ్చే పేమెంట్ అయినా.. అంటూ మరో మాట పేల్చారు. ఇంతటితో ఆగలేదు. నిర్మాతను ఉద్దేశించి.. తనపై ప్రేమకంటే కంప్లైంట్స్ ఎక్కువ చేస్తున్నారని అన్నారు.


అప్పుడెప్పుడో లెజెండ్ సినిమా ఫంక్షన్‌లో దేవిశ్రీ ప్రసాద్ కాస్తంత ఉద్రేకంగా మాట్లాడారు. డైరెక్టర్ బోయిపాటికి డైరెక్టుగా అప్పటికప్పుడే కౌంటరిచ్చారు. ఇప్పుడు ఇదే స్లయిల్‌లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడారు. తాను ఏదైనా డెరెక్టుగానే మాట్లాడతానంటూ చెప్పుకొచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు రీ రికార్డింగ్ ఆలస్యం చేశారని, ఇతర కంపోజర్లను సినిమా నిర్మాతలు సీన్‌లోకి తెచ్చారు. వారితో రీ రికార్డింగ్ చేయించారు. బహుస తెరవెనుక జరిగిన ఈ వ్యవహారం ఆయన ఇలా మాట్లాడడానికి కారణమై ఉండొచ్చని అభిమానులు చర్చించుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట..

సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...

బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 25 , 2024 | 11:06 AM