జగన్ పాపాలు బయటపెట్టిన సీఎం

ABN, Publish Date - Nov 07 , 2024 | 02:02 PM

ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలను సీఎం చంద్రబాబు బయట పెట్టారు. ఇవాళ రాష్ట్రంలో సమీక్షలు చేస్తుంటే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. ఏ వ్యవస్థ కూడా పనిచేయలేదని, జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశారని ధ్వజమెత్తారు.

అమరావతి: 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని, అమరావతిని ఏడారిగా మార్చిందని , పోలవరం డయాస్ ఫ్రాం వాల్‌ను సర్వ నాశనం చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన ఆయన తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలను బయట పెట్టారు. ఇవాళ రాష్ట్రంలో సమీక్షలు చేస్తుంటే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. ఏ వ్యవస్థ కూడా పనిచేయలేదని, జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశారని ధ్వజమెత్తారు.


వైసీపీ హాయంలో ఐదేళ్లు ఇబ్బందులుపడి అమరావతిని కాపాడిన ఘనత ఆడబిడ్డలదేనని సీఎం చంద్రబాబు కొనియాడారు. అమరావతిని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాని స్పష్టం చేశారు. వైసీపీ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.36 వేల కోట్ల భారం మోపిందన్నారు. విద్యుత్ భారానికి గత ప్రభుత్వమే కారణమని సీఎం ఆరోపించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని, అమరావతిని ఎడారిగా మార్చిన ఘనత గత ప్రభుత్వానిదేనని అన్నారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసిందని, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసిందని సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరులో పర్యటిస్తున్న హైడ్రా బృందం..

ఓయూలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం: కేటీఆర్

స్థల వివాదంపై పీవీ సింధు ఏమన్నారంటే..

డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం (ఫోటో గ్యాలరీ)

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 07 , 2024 | 02:02 PM