Video Viral: కాన్వాయ్ ఆపి మరి మహిళను పలకరించిన చంద్రబాబు..!

ABN, Publish Date - Jun 11 , 2024 | 05:26 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకోసం గన్నవరం సమీపంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకోసం గన్నవరం సమీపంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయితే మంగళవారం కూటమి ఎమ్మెల్యేలతో నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశమయ్యారు.

అనంతరం ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి బయలు దేరేందుకు తన కారు ఎక్కారు. అంతలో ఓ మహిళ.. పరుగు పరుగునా నారా చంద్రబాబు నాయుడు వద్దకు వచ్చారు. అయితే ఆమెను నిలువరించేందుకు చంద్రబాబు భద్రత సిబ్బంది ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని చంద్రబాబు అడ్డుకున్నారు.

దీంతో సదరు మహిళ.. చంద్రబాబు వద్దకు వచ్చారు. ఆ క్రమంలో ఆమె పేరు, ఊరును చంద్రబాబు స్వయంగా తెలుసుకున్నారు. తన పేరు నందిని అని.. తన స్వస్థలం మదనపల్లి అని తెలిపింది. తనకు 104 డిగ్రీల జర్వంతో బాధపడుతున్నానని చెప్పింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని ఆమెకు చంద్రబాబు సూచించారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated at - Jun 11 , 2024 | 05:26 PM