అడ్డంగా బుక్కైన బుగ్గన..నెక్స్ట్ నువ్వే
ABN, Publish Date - Dec 27 , 2024 | 09:46 PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు పంచాల్సిన బియ్యాన్ని ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. అధికారులతో కుమ్మక్కై.. కోట్ల రూపాయిల ప్రజా ధనాన్ని తమ జేబుల్లో వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆ దోపిడిదారులు ఒక్కొక్కరిగా బయట పడుతున్నారు. ఇటీవల పేర్ని నానికి చెందిన గోదాముల్లో భారీగా బస్తాల సంఖ్యలో తేడా వచ్చింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు పంచాల్సిన బియ్యాన్ని ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. అధికారులతో కుమ్మక్కై.. కోట్ల రూపాయిల ప్రజా ధనాన్ని తమ జేబుల్లో వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆ దోపిడిదారులు ఒక్కొక్కరిగా బయట పడుతున్నారు. ఇటీవల పేర్ని నానికి చెందిన గోదాముల్లో భారీగా బస్తాల సంఖ్యలో తేడా వచ్చింది. అదే కోవలో బేతంచర్లలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువులకి చెందిన గోడౌన్లలో 1300లకు పైగా బియ్యం బస్తాలు మాయమైనట్లు సమాచారం.
ఈ మాయమైన బస్తాల లెక్క తేల్చేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మాయమైన బస్తాలనీ ఇటీవల కాలానికి చెందినవేనని వారు పేర్కొంటున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో లెక్కలు తీస్తే.. గోలుమాల్ జరిగి ఉండే అవకాశాలున్నాయనే సంగతి వెలుగులోకి వస్తుందని ఓ చర్చ అయితే సాగుతోంది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 27 , 2024 | 09:46 PM