భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం: కవిత

ABN, Publish Date - Dec 29 , 2024 | 02:01 PM

నిజామాబాద్: అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చానని, తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని... దేనికీ భయపడనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని, రైతులు భూములు ఇవ్వకపోయినా, కేసులు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకింత భయమని కవిత ప్రశ్నించారు.

నిజామాబాద్: అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్నీ ఎదురించి వచ్చానని, తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని... దేనికీ భయపడనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఆమె ఎస్‌ఎఫ్‌ఎస్‌ సర్కిల్‌ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక తనపై, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారన్నారు. భయపడే రక్తం కాదని.. భయపెట్టే రక్తమని.. మేము తప్పు చేయలేదని... భయపడే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని అన్నారు.


కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని, రైతులు భూములు ఇవ్వకపోయినా, కేసులు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకింత భయమని కవిత ప్రశ్నించారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్లమని.. .గట్టిగా నిలబడతామని.. ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కవిత పిలుపిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

256 అడుగుల రామ్‌చరణ్ కటౌట్

జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్

పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు

కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 29 , 2024 | 02:01 PM