చెన్నమనేని భారతీయుడు కాదు.. 30 లక్షల జరిమానా.. హైకోర్టు ఝలక్
ABN, Publish Date - Dec 09 , 2024 | 04:57 PM
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో చుక్కెదురు అయింది. కోర్టును తప్పుదోవ పట్టించారంటూ రమేశ్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రివ్యూ పిటిషన్ ను హైకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ పై దాదాపు 10 ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఆ క్రమంలో తప్పుడు సమాచారం.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో చుక్కెదురు అయింది. కోర్టును తప్పుదోవ పట్టించారంటూ రమేశ్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రివ్యూ పిటిషన్ ను హైకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ పై దాదాపు 10 ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఆ క్రమంలో తప్పుడు సమాచారం. ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చెన్నమనేనికి రూ. 30 లక్షల జరిమానాను హైకోర్టు విధించింది. కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. మరో రూ. 5 లక్షలు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని చెన్నమనేని రమేశ్ కు హైకోర్టు స్పష్టం చేసింది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 17 , 2024 | 12:05 AM