చిన్నశంకరం పేటలో దారుణం..
ABN, Publish Date - Nov 03 , 2024 | 01:58 PM
మెదక్ జిల్లా: చిన్నశంకరం పేటలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య కలకలం రేపుతోంది. చేగుంట, మెదక్ రహదారి సమీపంలోని ఓ వ్యక్తిని హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే..
మెదక్ జిల్లా: చిన్నశంకరం పేటలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య కలకలం రేపుతోంది. చేగుంట, మెదక్ రహదారి సమీపంలోని ఓ వ్యక్తిని హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే గత నెలలో ఇలాంటి తరహా హత్య జరిగింది. 15 రోజుల వ్యవధిలో హత్య జరగడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఒకే తరహాలో హత్యలు జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది.
రెండు హత్యలు ఒకే తరహాలో జరగడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. గత నెల 24న ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ఓ వ్యక్తిని హత్య చేసి దహనం చేయడం జరిగింది. అలాంటి తరహాలోనే ఈరోజు హత్య జరిగింది. అయితే గత నెలలో హత్యకు గురైన వ్యక్తి వివరాలు ఇంత వరకు తెలియరాలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు ఆ కేసు కొలిక్కి రాకముందే ఇవాళ మరో ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారులు స్పందించి వరుస హత్యలపై త్వరితగతిన విచారణ చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులది
గ్రేటర్‌లో రికార్డు స్థాయిలో ఎయిర్ పొల్యూషన్
కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపు
మతిస్థిమితం లేని మహిళపై దారుణం..
గోవా నుంచి కలకత్తా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 03 , 2024 | 02:00 PM