అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీటీడీసీ

ABN, Publish Date - Nov 08 , 2024 | 09:57 AM

పర్యాటకాభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. కానీ జగన్‌ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించలేదు. కానీ పర్యాటక ఆస్తి అయిన రుషికొండను ధ్వంసం చేసి ఇంద్రభవనం లాంటి ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. దీనికోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు. పర్యాటక ప్రదేశాల రీ మోడలింగ్‌కు అవసరమైన నిధులు ఇవ్వకపోగా, ఏపీటీడీసీ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని అభివృద్ధి చేసుకోవాలని సలహాలు ఇచ్చారు.

విజయవాడ: నగరంలోని బరమ్‌ పార్క్‌ను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రూ.160 కోట్లకు తాకట్టుపెట్టింది. పర్యాటక ప్రదేశాలను రీ మోడలింగ్‌ చేసేందుకు నిధుల సేకరణ పేరిట ఆస్తులను తాకట్టు పెట్టేందుకు గత జగన్‌ ప్రభుత్వం ఆమోదం తెలపగా... తాజాగా కూటమి ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. బుధవారం ఏపీటీడీసీ అధికారులు విజయవాడలోని ఎస్‌బీఐకి బరమ్‌ పార్క్‌ ఆస్తి పేపర్లను తీసుకువెళ్లి మార్ట్‌గేజ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వంలో పర్యాటక శాఖకు నిధులు కేటాయించలేదు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఏపీటీడీసీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రెండేళ్ల క్రితం ఏపీటీడీసీకి చెందిన దాదాపు 15పర్యాటక ప్రదేశాలను రీమోడలింగ్‌ చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు దాదాపు రూ.160 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.


వాస్తవంగా పర్యాటకాభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. కానీ జగన్‌ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించలేదు. కానీ పర్యాటక ఆస్తి అయిన రుషికొండను ధ్వంసం చేసి ఇంద్రభవనం లాంటి ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. దీనికోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు. పర్యాటక ప్రదేశాల రీ మోడలింగ్‌కు అవసరమైన నిధులు ఇవ్వకపోగా, ఏపీటీడీసీ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని అభివృద్ధి చేసుకోవాలని సలహాలు ఇచ్చారు. టూరిజం అధికారులు ఆస్తులు తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

గ్రంధి శ్రీనివాస్ నివాసంలో మూడవరోజు ఐటీ సోదాలు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం...

జగన్ ‘మాడా’ మాటలు మాట్లాడటం సిగ్గుచేటు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 08 , 2024 | 09:57 AM