అజ్ఞాతంలో ఏపీఎండీసి మాజీ ఎండీ వెంకట్ రెడ్డి..

ABN, Publish Date - Aug 21 , 2024 | 08:32 AM

అమరావతి: డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి వ్యవహారం చిక్కడు.. దొరకడులా మారింది. ఇసుక టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన చాలా కాలంగా అజ్ఞాతంలో ఉంటున్నారు. ఆయన ఆచూకీని ఏసీబీ ఇంతవరకు కనిపెట్టలేకపోయింది.

అమరావతి: డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి వ్యవహారం చిక్కడు.. దొరకడులా మారింది. ఇసుక టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన చాలా కాలంగా అజ్ఞాతంలో ఉంటున్నారు. ఆయన ఆచూకీని ఏసీబీ ఇంతవరకు కనిపెట్టలేకపోయింది. ఈ నెల 31న రిటైర్ అయ్యేవరకు ఆయన బయటకు వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. వైసీపీ ముఖ్యనేత సలహాతో ఆయన ప్రస్తుతం చెన్నైలో సేదతీరుతున్నారని తెలుస్తోంది. గనులశాఖలోని జోడు పదవుల నుంచి తప్పించిన సర్కార్.. ఆయనను తమ నియంత్రణలో ఉంచుకోలేక పోయింది. ఇసుక టెండర్లలో అక్రమాలకు సంబంధించి జులై 31న ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అదే రోజున ఆయన డిప్యూటేసన్ కాల పరిమితి కూడా ముగిసింది. సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినా.. వాటిని తీసుకునేందుకు అందుబాటులో లేరు..


ఈ వార్తలు కూడా చదవండి..

కోల్‌కతా కేసుపై సుప్రీం కోర్టు సీరియస్..

సీఐడీ విచారణకు జోగి రమేష్ డుమ్మా ..

హైదరాబాద్‌లో వాన దడ

తాడిపత్రిలో హైటెన్షన్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 21 , 2024 | 08:32 AM