వారికే నామినేటెడ్ పదవులు: సీఎం

ABN, Publish Date - Nov 07 , 2024 | 09:50 AM

అమరావతి: నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. వారం రోజుల్లో ఈ పదవులు ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే పదవులు ప్రకటన చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడినవారికి పదవులు దక్కేలా చంద్రబాబు కసరత్తుచేస్తున్నారు.

అమరావతి: నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. వారం రోజుల్లో ఈ పదవులు ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే పదవులు ప్రకటన చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడినవారికి పదవులు దక్కేలా చంద్రబాబు కసరత్తుచేస్తున్నారు. సచివాలయంలో ఐదారు గంటలుగా ఈ నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. మొదటి జాబితాలో ప్రకటించిన పోస్టుల కంటే.. రెండో జాబితాలో రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఏపీలో 50 వరకు కులాలు, కార్పొరేషన్లు ఉండగా అందులో 30 నుంచి 35 వరకు పదవులు ఈ విడతలో భర్తీ చేస్తారని సమాచారం. వాటితోపాటు మరికొన్ని ఇతర కార్పొరేషన్ పదవుల నియామకం చేపడతారు. కార్పొరేషన్ పదవుల్లో టీడీపీతోపాటు కూటమి భాగస్వామ్య పార్టీలు జనసేన, బీజేపీ నేతలకు ప్రాధాన్యమిస్తారు. ఈనెల 11 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలలోపు నామినేటెడ్ పదవులు ప్రకటించే అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి..

20 రోజులుగా రైతన్నల బాధలు: కేటీఆర్

ఫార్ములా-ఈ రేసింగ్‌‌పై ఏసీబీ దూకుడు..

బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచమర్యాదలు

నెల రోజుల్లో సెట్‌ చేస్తా

టార్గెట్‌ కేటీఆర్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 07 , 2024 | 09:50 AM