కోస్తాకు బారీ వర్షాలు..బి అలర్ట్..
ABN, Publish Date - Dec 16 , 2024 | 02:05 PM
అమరావతి: ఏపీకి మరోసారి భారీ వర్షాల హెచ్చరికలతో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్టు జారీ చేశారు. ఈ మేరకు అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశారు. కోస్తా జిల్లాల్లో వరి, ప్రత్తి, పొగాకు ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అమరావతి: ఏపీకి మరోసారి భారీ వర్షాల హెచ్చరికలతో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్టు జారీ చేశారు. ఈ మేరకు అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశారు. కోస్తా జిల్లాల్లో వరి, ప్రత్తి, పొగాకు ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరి కోతలను రెండు మూడు రోజులపాటు వాయిదా వేసుకోవాలని ఇప్పటికే కోత కోసి పొలాల్లోఉన్న వరి పంటను కుప్పలుగా వేసుకోవాలని సూచించారు. మధ్య భారతం మీదుగా వస్తున్న చలి గాలుల ప్రభావంతో ఛత్తీస్‌గఢ్.. దానికి ఆనుకుని ఒడిషా, ఉత్తరాంధ్ర జిల్లాలు.. తెలంగాణకు ఆనుకుని కోస్తా ప్రాంతాల్లో చలి మరింత పెరిగింది. అనేక ప్రాంతాల్లో మంచు కురిసింది.
ఆదివారం విశాఖ ఏజెన్సీలోని జీ.మాడుగులలో 5.6, కుంతలలో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జీ.మాడుగులలో ఈ ఏడాది నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. శనివారం జీ.మాడుగలలో 8.9 డిగ్రీలు ఉండగా ఒక్క రోజులో 3 డిగ్రీలు తగ్గడం గమనార్హం. గత మూడు రోజులుగా ఏజెన్సీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
r. NTR: ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు..
KC రెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం..
జగన్ నిర్వాకం.. రైతుల కష్టాలు..
ABN Live..: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 16 , 2024 | 02:05 PM