మహిళలపై యాసిడ్ వంటి లిక్విడ్ దాడి
ABN, Publish Date - Dec 01 , 2024 | 09:44 AM
విశాఖలోదారుణం జరిగింది. కంచరపాలెం ఐటిఐ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుపై ఓ వ్యక్తి యాసిడ్ వంటి లిక్విడ్ పోసాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని బాధిత మహిళలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
విశాఖ: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై యాసిడ్ వంటి లిక్విడ్ దాడి జరిగింది. కంచరపాలెం ఐటిఐ జంక్షన్ వద్ద ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నుంచి ఓ వ్యక్తి బస్సుపై యాసిడ్ వంటి లిక్విడ్ పోసాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. సీసీ పుటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది, దీనికి సంబంధించి పోలీసులు సీసీ పూటేజి విడుదల చేశారు.
ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని బాధిత మహిళలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అంతరం వారిని ఇంటికి పంపించారు. నిందితుడి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు ముందు నిందితుడు రోడ్‌పై నడిచి వెళ్తున్నట్టు దృశ్యాలు రికార్డయ్యాయి. అందులో ఓ అనుమానిత వ్యక్తి చేతిలో కవర్ లాంటిది పట్టుకుని వెళుతున్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు ఓ ప్రకటన చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపినవారికి తగిన పారితోషికంతో పాటు వివరాలు గొప్యంగా ఉంచుతామని ప్రకటించారు. కాగా దాడి అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. దాడికి గురైన ముగ్గురు మహిళలు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినాష్ రెడ్డి బాధితుడికి కూటమి ప్రభుత్వం న్యాయం..
స్టెల్లా షిప్‌కు నో డ్యూ సర్టిఫికెట్‌కు నిరాకరణ
లంగర్‌హౌస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 01 , 2024 | 09:44 AM