Share News

Congress: టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నేడు

ABN , Publish Date - Jan 03 , 2024 | 08:44 AM

హైదరాబాద్: టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం బుధవారం గాంధీభవన్‌లో జరగనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి కార్యవర్గ సమావేశం కావడంతో ప్రతి ఒక్కరూ హాజరుకావాలని టీపీసీసీ ఆదేశించింది.

Congress: టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నేడు

హైదరాబాద్: టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం బుధవారం గాంధీభవన్‌లో జరగనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి కార్యవర్గ సమావేశం కావడంతో ప్రతి ఒక్కరూ హాజరుకావాలని టీపీసీసీ ఆదేశించింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నూతన ఇంచార్జ్ దీపా దాస్ మున్షి హాజరుకానున్నారు. ఇంకా ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, పీఈసీ సభ్యులు, మంత్రులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, చైర్మన్‌లు అధికార ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. అలాగే నామినేటెడ్ పోస్టులు, కార్పోరేషన్ ఛైర్మన్ల భర్తీ అంశంపై కూడా చర్చించే అవకాశమున్నట్లు తెలియవచ్చింది. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లేలా కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 08:44 AM