Share News

TS News: చైల్డ్ ట్రాఫికింగ్ కేస్‌లో దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - May 29 , 2024 | 10:57 AM

చైల్డ్ ట్రాఫికింగ్ కేస్‌లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాచకొండ కమిషనరేట్ పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలోని విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగుతోంది. కిరణ్, ప్రీతి అనే ఇద్దరు కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఎక్కడి నుంచి పిల్లల్ని తెచ్చారో పోలీసులు తేల్చనున్నారు. 50 మంది చిన్నారులను ముఠా అమ్మేసింది. అక్రమ పద్ధతిలో పిల్లలని కొనుక్కున్న వారిని గుర్తించి చిన్నారులను పోలీసులు రక్షించారు.

TS News: చైల్డ్ ట్రాఫికింగ్ కేస్‌లో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్: చైల్డ్ ట్రాఫికింగ్ కేస్‌ (Child Trafficking case)లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionarate) పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీ (Delhi)లోని విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగుతోంది. కిరణ్, ప్రీతి అనే ఇద్దరు కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఎక్కడి నుంచి పిల్లల్ని తెచ్చారో పోలీసులు తేల్చనున్నారు. 50 మంది చిన్నారులను ముఠా అమ్మేసింది. అక్రమ పద్ధతిలో పిల్లలని కొనుక్కున్న వారిని గుర్తించి చిన్నారులను పోలీసులు రక్షించారు.13 మంది చిన్నారులను సీడబ్ల్యూసీకి పోలీసులు తరలించారు. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేయగా.. వీరంతా ఏజెంట్లుగా పని చేసినట్టు గుర్తించడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో శోభా రాణి , హేమలత , సలీం , చేతన్, పద్మ, సరోజ, శారద, రాజు, అనురాధ, మమత, ముంతాజ్‌ ఉన్నారు.

Hyderabad: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...


అక్రమంగా కొనుక్కున్న తలిదండ్రులపై లీగల్‌గా ముందుకు వెళ్తున్నామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు తెలిసో తెలియకో పిల్లలు లేరన్న ఆందోళనతో చిన్నారులను కొనుగోలు చేసిన తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం. ఒకవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ దూరమవగా.. మరోవైపు కేసులు సైతం వారిని ఇబ్బంది పెడుతున్నాయి. నిన్న అసలు తల్లిదండ్రులకు చిన్నారులను అప్పగిస్తుంటే పెంచిన తల్లులతో పాటు చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంతకాలం తమ తల్లిదండ్రులనుకున్న వారు కాదని తెలుసుకోని పసితనం.. వీరిని వీడి కన్నతల్లిదండ్రుల వద్దకు వెళ్లలేక చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తుంటే చూసిన ప్రతి ఒక్కరికీ కళ్లు చెమర్చాయి.

ఇదికూడా చదవండి

Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Updated Date - May 29 , 2024 | 10:57 AM