Share News

TG News: సింగరేణి మాజీ సీఎండీ ఎన్ శ్రీధర్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 18 , 2024 | 09:41 PM

సింగరేణి మాజీ సీఎండీ ఎన్ శ్రీధర్‌ (Sridhar) కు కేంద్ర ప్రభుత్వం (Central Govt) షాక్ ఇచ్చింది. ఎన్ఎండీసీ సీఎండీగా శ్రీధర్ నియామక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. గత ఏడాది మార్చి 18వ తేదీన పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ సెలక్షన్ బోర్డ్ సీఎండీ పోస్ట్ కోసం 7 మందిని ఇంటర్వ్యూ చేసింది.

TG News: సింగరేణి మాజీ సీఎండీ ఎన్ శ్రీధర్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్.. కారణమిదే..?

భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి మాజీ సీఎండీ ఎన్ శ్రీధర్‌ (Sridhar) కు కేంద్ర ప్రభుత్వం (Central Govt) షాక్ ఇచ్చింది. ఎన్ఎండీసీ సీఎండీగా శ్రీధర్ నియామక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. గత ఏడాది మార్చి 18వ తేదీన పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ సెలక్షన్ బోర్డ్ సీఎండీ పోస్ట్ కోసం 7 మందిని ఇంటర్వ్యూ చేసింది. వారిలో సింగరేణి సీఎండీగా ఉన్న శ్రీధర్‌ని పీఈఎస్‌బీ నియమించింది. శ్రీధర్‌పై పలు అవినీతి ఫిర్యాదులు సీవీసీకి చేరడంతో ఎన్ఎండీసీ సీఎండీగా పగ్గాలు చేపట్టకుండా కోల్ మినిస్ట్రీ అడ్డుకున్నది. పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ ప్రతిపాదనను అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ తిరస్కరించింది. ఎన్ఎండీసీ కొత్త సీఎండీ ఎంపిక కోసం ప్రక్రియను ప్రారంభించాలని స్టీల్ మినిస్ట్రీ సింగరేణిని ఆదేశించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 09:42 PM