Share News

తెలంగాణ రైజింగ్‌!

ABN , Publish Date - Nov 29 , 2024 | 03:44 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరి ఏడాదవుతున్న సందర్భంగా ప్రభుత్వం కొత్త లోగోను తీసుకువచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కావడంతో పాటు, దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఎదుగుతున్నదనే విషయాన్ని తెలిపేలా ‘తెలంగాణ రైజింగ్‌’ అనే పేరుతో లోగోను రూపొందించింది.

తెలంగాణ రైజింగ్‌!

  • అన్ని ప్రభుత్వ శాఖల వెబ్‌ పోర్టళ్లపై నూతన లోగో

  • ప్రజా విజయోత్సవాలకు చిహ్నంగా ఏర్పాటు

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరి ఏడాదవుతున్న సందర్భంగా ప్రభుత్వం కొత్త లోగోను తీసుకువచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కావడంతో పాటు, దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఎదుగుతున్నదనే విషయాన్ని తెలిపేలా ‘తెలంగాణ రైజింగ్‌’ అనే పేరుతో లోగోను రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌ పోర్టల్‌తో పాటు, అన్ని ప్రభుత్వ శాఖల వెబ్‌ పోర్టళ్లపై ఇక నుంచి ఈ లోగో దర్శనమివ్వనుంది.


డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల్లోనూ ఈ లోగో ప్రధానంగా కనిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకటో నెంబర్‌ అంకెపై ఒక గుండ్రటి చక్రంలో తెలంగాణ మ్యాప్‌ను ఉంచి, అందులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు కనబడేలా అశోకచక్రం లాంటిదానిని ఉంచారు. ఒకటో నెంబర్‌ అంకె కిందిభాగంలో ‘తెలంగాణ రైజింగ్‌’ అని రాశారు.

Updated Date - Nov 29 , 2024 | 03:44 AM