Share News

శబరిమలకు ప్రత్యేక రైళ్ల రద్దు

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:30 AM

వచ్చే నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు శబరిమల ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

శబరిమలకు ప్రత్యేక రైళ్ల రద్దు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు శబరిమల ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల నుంచి స్పందన కరువవడంతో మౌలాలి-కొట్టాయం, కాచిగూడ-కొట్టాయం, నర్సాపూర్‌-కొల్లాం, నాంపల్లి-కొట్టాయం, కాగజ్‌నగర్‌-కొల్లాం మార్గాల్లో ప్రకటించిన 14 రైళ్లను రద్దు చే శారు.


కుంభమేళాకు 16 ప్రత్యేక రైళ్లు..

మహాకుంభ మేళాలో పాల్గొనే యాత్రికుల కోసం దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. జనవరి18, 21 తేదీల్లో మౌలాలి-అజాంఘడ్‌, జనవరి20, 23 తేదీల్లో అజాంఘడ్‌-మౌలాలి, జనవరి 19న మౌలాలి-గయ, 21న గయ-మౌలాలి, 22న మౌలాలి-గయ, 24న గయ-మౌలాలి, 25న కాచిగూడ-పట్నా, 27న పట్నా-కాచిగూడ రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.


20 ప్రత్యేక రైళ్ల పొడిగింపు...

వేర్వేరు ప్రాంతాల నుంచి వెళ్లి వచ్చే 20 ప్రత్యేక రైళ్లను వచ్చే మార్చి నెలాఖరు వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. జనవరి 29 నుంచి మార్చి 28 వరకు సికింద్రాబాద్‌-రామాంతపురం-సికింద్రాబాద్‌, జనవరి 27నుంచి ఏప్రిల్‌ 2వరకు కాచిగూడ-మధురై-కాచిగూడ, జనవరి 24నుంచి మార్చి 30వరకు నాందేడ్‌-ఈరోడ్‌-నాందేడ్‌, జనవరి24 నుంచి మార్చి 30వరకు కాచిగూడ-నాగర్‌కోయల్‌-కాచిగూడ రైళ్లను పొడిగించారు.

Updated Date - Dec 28 , 2024 | 05:30 AM