Share News

Rangareddy Dist.: కాటేదాన్‌లో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Jan 17 , 2024 | 10:07 AM

రంగారెడ్డి: జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. నేతాజీనగర్‌లోని ఓ డ్రమ్స్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడంతో దట్టంగా ఆ ప్రాంతంలో నల్లటి పొగ అలుముకుంది.

Rangareddy Dist.: కాటేదాన్‌లో అగ్నిప్రమాదం

రంగారెడ్డి: జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. నేతాజీనగర్‌లోని ఓ డ్రమ్స్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడంతో దట్టంగా ఆ ప్రాంతంలో నల్లటి పొగ అలుముకుంది. స్థానికులు ఇచ్చిన స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. భారీగా మంటలు ఎగిసి పడడంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ప్రమాదానికి గురైన పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jan 17 , 2024 | 10:19 AM