Share News

Rahul Gandhi: తెలంగాణతో నాకున్నది రాజకీయ సంబంధం కాదు.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 08:25 PM

తెలంగాణతో తనకున్నది రాజకీయ సంబంధం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. తుక్కుగూడలో శనివారం జరిగిన తెలంగాణ జన జాతర సభకి రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Rahul Gandhi: తెలంగాణతో నాకున్నది రాజకీయ సంబంధం కాదు.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

తుక్కుగూడ: తెలంగాణతో తనకున్నది రాజకీయ సంబంధం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. తుక్కుగూడలో శనివారం జరిగిన తెలంగాణ జన జాతర సభకి రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ..

"తెలంగాణ ప్రజలకు నాకు ఉన్న సంబంధం రాజకీయ సంబంధం కాదు. కుటుంబ సంబంధం. తెలంగాణ ప్రజలు విద్వేషాల బజార్లో ప్రేమ దుకాణాలను తెరిచారు. జీవితాంతం మీకు అందుబాటులో ఉంటానని మాట ఇస్తున్నా. రాష్ట్రం నుంచి చిన్న పిల్లోడు నన్ను పిలిచినా ఇక్కడికి వస్తాను. తెలంగాణ కొత్త రాష్ట్రం. కాంగ్రెస్ పాలనలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. మేడ్ ఇన్ చైనా కంటే.. మేడ్ ఇన్ తెలంగాణ అనే వ్యవస్థగా మారాలి" అని రాహుల్ అన్నారు.

Heart Attacks: గుండెపోటు ముందు వచ్చే సంకేతాలివే..

Updated Date - Apr 06 , 2024 | 08:27 PM