Share News

Hyderabad: పవర్‌ ఇంజనీర్స్‌ అధ్యక్షుడిగా పి.రత్నాకర్‌రావు

ABN , Publish Date - Nov 16 , 2024 | 03:54 AM

తెలంగాణ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా పి.రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా పి.సదానందం ఎన్నికయ్యారు. ఈ నెల 13వ తేదీన సంఘం కార్యవర్గం ఎన్నిక జరగ్గా... శుక్రవారం ఫలితాలు విడుదల చేశారు.

Hyderabad: పవర్‌ ఇంజనీర్స్‌ అధ్యక్షుడిగా పి.రత్నాకర్‌రావు

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా పి.రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా పి.సదానందం ఎన్నికయ్యారు. ఈ నెల 13వ తేదీన సంఘం కార్యవర్గం ఎన్నిక జరగ్గా... శుక్రవారం ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అసోసియేట్‌ అధ్యక్షుడిగా జె.ఎల్‌.జనప్రియ, అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎం.వెంకటేశ్వర్లుతో పాటు 17 మంది గెలుపొందారు.


ఆ తర్వాత ట్రాన్స్‌కో విభాగం ఉపాధ్యక్షుడిగా ఎం.రమేశ్‌, కార్యదర్శిగా కె.వెంకటేశ్వర్‌తో పాటు 14 మందిని ఎన్నుకున్నారు. ఇక జెన్‌కో విభాగం ఉపాధ్యక్షుడిగా టి.బ్రహ్మాజీ, కార్యదర్శిగా ఎన్‌.సురేశ్‌కుమార్‌తో పాటు 17 మందిని, టీజీ ఎస్పీడీసీఎల్‌ విభాగం ఉపాధ్యక్షుడిగా కె.జైహింద్‌, కార్యదర్శిగా బి.శ్రీనివా్‌సరెడ్డితో పాటు 13 మంది గెలిచారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ విభాగం ఉపాధ్యక్షుడిగా వి.రాంబాబు, కార్యదర్శి బి.సమ్యను ఎన్నుకున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 03:54 AM