Share News

Elections: తెలంగాణ సచివాలయంలోకి పబ్లిక్‌కు నో ఎంట్రీ!

ABN , Publish Date - Mar 20 , 2024 | 01:32 PM

Telangana: దేశవ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమలుల్లోకి వచ్చేసింది. తెలంగాణలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్రంలో కూడా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అటు సెక్రటేరియట్‌కు ఎన్నికల కోడ్ వర్తించడంతో మంత్రులను కలిసేందుకు వచ్చే ప్రజలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు అధికారులు. కోడ్ అమలులో ఉన్నందున మంత్రుల ఛాంబర్‌కు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.

Elections: తెలంగాణ సచివాలయంలోకి పబ్లిక్‌కు నో ఎంట్రీ!

హైదరాబాద్, మార్చి 20: దేశవ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు (General elections)కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ (Election Code) అమలుల్లోకి వచ్చేసింది. తెలంగాణలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్రంలో కూడా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అటు సెక్రటేరియట్‌కు (Telangana Secretariat) ఎన్నికల కోడ్ వర్తించడంతో మంత్రులను కలిసేందుకు వచ్చే ప్రజలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు అధికారులు. కోడ్ అమలులో ఉన్నందున మంత్రుల ఛాంబర్‌కు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. శాఖల వారీగా పనులు ఉంటే తప్ప సెక్రటేరియట్‌లోకి అనుమతిపై ఆంక్షలు విధించారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ఏ కార్యక్రమాలను అమలు చేయొద్దంటూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కోడ్ రాక ముందు నిత్యం వివిధ సమస్యలపై సెక్రటేరియట్‌కు పబ్లిక్ క్యూకట్టారు. కోడ్ అమల్లో ఉన్నందున అధికారిక నిర్ణయాలకు బ్రేక్ పడినట్లైంది. పెండింగ్ సమస్యలపై  అధికారులను మాత్రమే కలిసేందుకు సచివాలయంలోకి ప్రజలను అనుమతి ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమస్యలు చెప్పుకునేందుకు సెక్రటేరియట్‌కు రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. అయితే కోడ్ అమల్లోకి రాగానే సచివాలయంలోకి వెళ్లే పబ్లిక్‌కు తెలంగాణ సర్కార్ ఆంక్షలు విధించింది.

ఇవి కూడా చదవండి..

AP Politics: రెచ్చిపోయిన ఎమ్మెల్యే.. కారు ఆపి మరీ వారిపై


AP Politics: షర్మిల దెబ్బ.. జగన్ అబ్బా.. ఎన్నికలవేళ పీక్స్‌కు చేరిన పాలిటిక్స్..!


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 02:48 PM