NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న
ABN , Publish Date - Dec 17 , 2024 | 06:03 AM
నదుల అనుసంధానం, ప్రాజెక్టుల పురోగతిపై చర్చించడానికి వీలుగా న్యూఢిల్లీలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది.

కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన సమావేశం
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానం, ప్రాజెక్టుల పురోగతిపై చర్చించడానికి వీలుగా న్యూఢిల్లీలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ఉంటుంది. ఇందులో ప్రధానంగా గోదావరి-కావేరీ అనుసంధానంపై చర్చించనున్న ట్లు సమాచారం. ఇంచంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టకుండా.. సమ్మక్కసాగర్(తుపాకులగూడెం)బ్యారేజీలో 83మీటర్ల పైన నిల్వ చేసిన నీటిని మాత్రమే తరలించాలని, ఇక గోదావరి-కావేరీ అనుసంధానంలో తెలంగాణకు కేటాయించే కోటా కింద గొట్టిముక్కల వద్ద 2 రిజర్వాయర్లు కట్టించాలని, కృష్ణా జలాల వివాదం తేలేదాకా నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకోరాదన్న తెలంగాణ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. పోలవరం నుంచే గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టాలని ఏపీ విజ్ఞపి చేయగా... కేం ద్రం సున్నితంగా తిరస్కరించి గోదావరి-పెన్నా అనుసంధానం అంత్రరాష్ట్ర ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించిన విషయం విదితమే.