Share News

Mahesh Kumar Goud: స్కిల్‌ వర్సిటీకి కేటీఆర్‌ డబ్బులు ఇచ్చినా స్వీకరిస్తాం

ABN , Publish Date - Nov 23 , 2024 | 04:48 AM

స్కిల్‌ వర్సిటీకి అదానీ రూ. వంద కోట్లు ఇచ్చినట్లుగా.. కేటీఆర్‌ కూడా తను సంపాదించిన దాంట్లో రూ.50 కోట్లు ఇస్తే స్వీకరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ అన్నారు.

Mahesh Kumar Goud: స్కిల్‌ వర్సిటీకి కేటీఆర్‌ డబ్బులు ఇచ్చినా స్వీకరిస్తాం

  • అవేమీ మా జేబులోకి వెళ్లే డబ్బులు కాదు కదా?

  • టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌

హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): స్కిల్‌ వర్సిటీకి అదానీ రూ. వంద కోట్లు ఇచ్చినట్లుగా.. కేటీఆర్‌ కూడా తను సంపాదించిన దాంట్లో రూ.50 కోట్లు ఇస్తే స్వీకరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రంలో అదానీ కార్యకలాపాలు జరిగాయని, అప్పుడు ఆ పార్టీ నేతలకు వ్యక్తిగతంగా డబ్బులూ ముట్టినాయని ఆరోపించారు. వర్సిటీ కోసం ఎవరు డబ్బులిచ్చినా.. అవేమీ తమ జేబులోకి వెళ్లవని చెప్పారు. అదానీ ఇచ్చిన డబ్బులు రేవంత్‌రెడ్డి కోసం కాదని, అవి ప్రజా అవసరాల కోసం స్కిల్‌ వర్సిటీకి ఇచ్చినవన్నారు. ఎవరైనా చట్టాలకు లోబడి వ్యాపారాలు చేసుకుంటే తమకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. దావో్‌సలో జరిగిన రూ.50 వేల కోట్ల మేరకు పెట్టుబడి ఒప్పందాల్లో చట్టానికి లోబడి ఉన్నవి కొనసాగుతాయని, లేనివి వెళ్లిపోతాయని స్పష్టం చేశారు. అదానీకి తెలంగాణలో తాము ఇంతవరకు ఇంచు భూమి కూడా ఇవ్వలేదన్నారు.


అదానీ రూ. వేల కోట్లలో ఆర్థిక నేరాలకు పాల్పడినా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. అదానీని అరెస్టు చేసి.. ఆయనపై వచ్చిన ఆరోపణలపైన జేపీసీ వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా.. ఉంటే డిసెంబరు 1న పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న మాదగల విజయ గర్జన సభలో ముఖ్య అతిథిగా పాల్గొనాలంటూ కాంగ్రెస్‌ పార్టీ మాదిగ నేతలు మహే్‌షకుమార్‌గౌడ్‌ను కలిసి ఆహ్వానించారు. మాజీ మంత్రి చంద్రశేఖర్‌, నేతలు సతీష్‌ మాదిగ, గజ్జెల కాతం ఆహ్వాన పత్రాన్ని అందించారు. ప్రస్తుతం గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని పాతబస్తీలోని మదీనా చౌరాస్తాలో పెట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హన్మంతరావు ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Nov 23 , 2024 | 04:48 AM