Share News

Mahesh Kumar Goud: బీజేపీ చార్జ్‌షీట్‌.. గురివెంద సామెతలా ఉంది

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:12 AM

ఏడాది కాంగ్రెస్‌ పాలనపై బీజేపీ విడుదల చేసిన చార్జ్‌షీట్‌ను చూస్తుంటే గురివెంద సామెత గుర్తుకు వస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు.

Mahesh Kumar Goud: బీజేపీ చార్జ్‌షీట్‌.. గురివెంద సామెతలా ఉంది

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సవాల్‌

హైదరాబాద్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఏడాది కాంగ్రెస్‌ పాలనపై బీజేపీ విడుదల చేసిన చార్జ్‌షీట్‌ను చూస్తుంటే గురివెంద సామెత గుర్తుకు వస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎ్‌సతో బీజేపీ నేతలు అంటకాగుతుండటంతో ప్రధాని మోదీ చీవాట్లు పెట్టారని, అందుకే చార్జ్‌షీట్ల పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షే మ పథకాలపై చర్చించేందుకు తాము సిద్ధమని.. కేంద్రంలో పదేళ్ల బీజేపీ చీకటి పాలనపై చర్చకు ఆ పార్టీ నేతలు సిద్ధమా..? అంటూ సవాల్‌ విసిరారు. ప్రధాని మోది ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని, బీజేపీ పాలనలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూల్చేశారని, దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 411 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్చుకున్నారని ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు.

Updated Date - Dec 02 , 2024 | 03:12 AM