Share News

Crime News: మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్లలో ఓ తండ్రి దుర్మార్గం..

ABN , Publish Date - Jan 08 , 2024 | 08:44 AM

మహబూబ్ నగర్ జిల్లా: జడ్చర్లలో ఓ తండ్రి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. సొంత బిడ్డలనే కిడ్నాప్ చేసి.. డబ్బులు డిమాండ్ చేస్తూ భార్యకు ఫోన్ చేశాడు. గౌరీ శంకర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Crime News: మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్లలో ఓ తండ్రి దుర్మార్గం..

మహబూబ్ నగర్ జిల్లా: జడ్చర్లలో ఓ తండ్రి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. సొంత బిడ్డలనే కిడ్నాప్ చేసి.. డబ్బులు డిమాండ్ చేస్తూ భార్యకు ఫోన్ చేశాడు. గౌరీ శంకర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి రఫీ.. డబ్బుల కోసం తన ముగ్గురు కన్నబిడ్డలను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ ఘటనపై రఫీ భార్య హబీబ్ ఉన్నిస జడ్చర్ల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ ట్రాక్ ద్వారా నిందితుడిని గుర్తించారు. హైదరాబాద్ యాకుత్ పుర రైల్వే స్టేషన్ సమీపంలో రఫీని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - Jan 08 , 2024 | 08:45 AM