Hyderabad: అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే!
ABN , Publish Date - Oct 27 , 2024 | 04:19 AM
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు తమ అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్తు కోసమే
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరింది అందుకే
కాంగ్రెస్ పార్టీపై ప్రేమతో రాలేదు
ప్రభుత్వాన్ని పడగొడతామన్న కిషన్‌రెడ్డి,
కేటీఆర్ బెదిరింపుల వల్లే చేర్చుకున్నాం
మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
గంగారెడ్డి కుటుంబానికి పరామర్శ
ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరింది అందుకే: మధుయాష్కీ
జగిత్యాల, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు తమ అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రె్‌సలో చేరారని అన్నారు. అంతే తప్ప. కాంగ్రెస్ పార్టీపై ప్రేమతో కాదన్నారు. ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెదిరింపులకు పాల్పడటం వల్లనే తాము ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయినా.. వారికి తాము ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు.
శనివారం జగిత్యాలలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డిని కలిశారు. ఇటీవల హత్యకు గురైనజీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల నిర్లక్ష్యం వల్లే గంగారెడ్డి హత్య జరిగిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి తీసుకొస్తామన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు వెంటనే పదవులు కోల్పోయేలా చట్టం అమలు చేస్తామన్నారు.