Siddipet: కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం నేడు
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:13 AM
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొముర వెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది.

చేర్యాల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొముర వెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో వీరశైవాగమశాస్త్రం ప్రకారం కేతలమ్మ, మేడలాదేవీలను స్వామి వివాహమాడ నున్నారు. కల్యాణంతో మూడు నెలలపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ, రవాణాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలతో అలంకరించి, తలంబ్రాలు అందజేయనున్నారు.