Share News

Khammam: పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం...

ABN , Publish Date - Feb 18 , 2024 | 01:37 PM

కల్లూరు మండలంలోని నారాయణపురం(Narayanapuram) గ్రామం నవ్యకాంతులతో జిగేల్‌మంటోంది. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్వస్థలమైన ఈ పల్లెలో ఇప్పుడు ఓ కళ్లు చెదిరే ప్యాలెస్‌ అందరినీ అబ్బుర పరుస్తోంది.

Khammam: పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం...

కల్లూరు(ఖమ్మం): కల్లూరు మండలంలోని నారాయణపురం(Narayanapuram) గ్రామం నవ్యకాంతులతో జిగేల్‌మంటోంది.

రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్వస్థలమైన ఈ పల్లెలో ఇప్పుడు ఓ కళ్లు చెదిరే ప్యాలెస్‌ అందరినీ అబ్బుర పరుస్తోంది. మంత్రి సోదరుడి కుమారుడు లోహిత్‌రెడ్డి వివాహ రిసెప్షన్‌ వేడుక ఆదివారం మధ్యాహ్నం నారాయణపురంలో జరగనుంది. ఇందుకోసం ఎంకే ఆర్కిటెక్ట్‌ అధినేత మల్లికార్జునరావు నేతృత్వంలో పీఎస్‌ఆర్‌ పేరుతో 70ఎకరాల్లో ఏకంగా ఓ ప్యాలెస్‌ సెట్టింగ్‌నే నిర్మించారు. ఈ వేడుకలో సుమారు 1.50 లక్షల మందికి వెజ్‌, నాన్‌వెజ్‌ భోజన ఏరాట్లు చేశారు. పలువురు మంత్రులు, వీఐపీలు రానుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. తిరువూరు క్రాస్‌ రోడ్డు వైపున హెలీప్యాడ్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ నెల 14న గల్ఫ్‌లోని బహ్రెయిన్‌లో లోహిత్‌రెడ్డి పెళ్లి జరిగిన విషయం విదితమే.

pongu.jpg

Updated Date - Feb 18 , 2024 | 01:37 PM