Share News

KCR: కేసీఆర్‌ ‘పొలం బాట’ నేడు

ABN , Publish Date - Mar 31 , 2024 | 06:49 AM

సాగు నీటి సమస్య వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ఆదివారం పొలం బాట పట్టనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో నీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు.

KCR: కేసీఆర్‌ ‘పొలం బాట’ నేడు

  • జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటన

  • ఎండిన పంటలను పరిశీలించనున్న మాజీ సీఎం

  • కేసీఆర్‌ ‘పొలం బాట’ నేడు

  • జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో పర్యటన

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): సాగు నీటి సమస్య వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ఆదివారం పొలం బాట పట్టనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో నీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు.

రైతుల ఇబ్బందులను తెలుసుకుని వారికి భరోసా కల్పించేలా ఈ యాత్ర ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌ నుంచి కేసీఆర్‌ ఆదివారం ఉదయం 8:30కు బయలుదేరుతారు. 10:30కు జనగామ జిల్లా దేవరుప్పులలోని ధరావత్‌ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు.


11:30కు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అరవపల్లి, సూర్యాపేట గ్రామీణ మండలాల పరిధిలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సూర్యాపేట గ్రామీ ణ మండలంలో బయలుదేరి 1:30కు సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2 గంటలకు అక్కడ భోజనం చేస్తారు.

3 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. 3:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 4:30 గంటలకు నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌కు బయలుదేరుతారు.

Updated Date - Mar 31 , 2024 | 06:50 AM