Share News

Adi Srinivas: తెలంగాణలో తప్ప ఎక్కడా కేసీఆర్‌ను గుర్తు పట్టరు

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:08 PM

తెలంగాణలో తప్ప ఎక్కడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గుర్తు పట్టరని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నేడు ఆయన సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో ఉండలేక రేవంత్ రెడ్డి పై నమ్మకంతో ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారన్నారు.

Adi Srinivas: తెలంగాణలో తప్ప ఎక్కడా కేసీఆర్‌ను గుర్తు పట్టరు

హైదరాబాద్: తెలంగాణలో తప్ప ఎక్కడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR)ను గుర్తు పట్టరని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) అన్నారు. నేడు ఆయన సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో ఉండలేక రేవంత్ రెడ్డి పై నమ్మకంతో ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారన్నారు. కేటీఆర్ రాజ్యాంగం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని.. ఫిరాయింపులకు పాల్పడింది ముందు మీరు కాదా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీదని పేర్కొన్నారు. ఆనాడు ప్రగతి భవన్‌లో చేర్చుకున్నప్పుడు ఎటు పోయిందీ నిజాయతి అని ప్రశ్నించారు.


ఫామ్ హౌస్‌లో కూర్చొని కేసీఆర్ కాహానీలు చెప్తున్నాడని ఆది శ్రీనివాస్ విమర్శించారు. కొద్ది రోజుల తర్వాత ఫామ్ హౌస్‌కు ముఖ్యమంత్రిని అంటాడని ఎద్దేవా చేశారు. అధికారం మీద కేసీఆర్‌కు యావ తగ్గలేదన్నారు. ఇంకా ఊహల్లో భ్రమల మధ్య ఉన్నాడన్నారు. బీఆర్ఎస్ ఓడితే మహారాష్ట్ర రైతులు బాధపడుతున్నారని అంటాడని.. అసలు అక్కడ బీఆర్ఎస్ శాఖ కూడా లేదని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతు బంధు పేరిట 20 వేల కోట్లు కొండలు, గుట్టలకు ఇచ్చాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్ష పాతి అని పేర్కొన్నారు. ఏకకాలంలో కెణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదన్నారు. ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేసి చూపిస్తామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

UK Elections 2024: నన్ను క్షమించండి.. రిషి సునాక్ కీలక ప్రకటన..

Amarnath Yatra: ఒక్కరోజులోనే హైదరాబాద్ టూ అమర్‌నాథ్ యాత్ర.. ఖర్చు, జర్నీ విశేషాలివే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 05 , 2024 | 01:08 PM