Share News

Jitta Balakrishna reddy: జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:01 AM

తెలంగాణ సాధనే లక్ష్యంగా యువతను సంఘటితం చేసి మలి దశ ఉద్యమంలో క్రియాశీల ప్రాత పోషించిన జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కన్నుమూశారు.

Jitta Balakrishna reddy: జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

  • బ్రెయిన్‌ ట్యూమర్‌తో అస్వస్థత.. నెలన్నర నుంచి ఆస్పత్రిలో..

  • పరిస్థితి విషమించడంతో లామాపై భువనగిరికి తరలింపు

  • సొంతగడ్డపై కన్నుమూయాలన్న కోరికతో వెంటిలేటర్‌ తొలగింపు

  • అశ్రునయనాలతో వీడ్కోలు జన సంద్రమైన భువనగిరి

  • టీఆర్‌ఎ్‌సతో రాజకీయాల్లోకి కాంగ్రెస్‌, వైసీపీలో సేవలు

  • యువ తెలంగాణ పేరిట సొంత పార్టీ

  • ఎన్నికల ముంగిట కాంగ్రె్‌సలోకి వెంటనే బీఆర్‌ఎ్‌సలోకి..

  • మంచి స్నేహితుడిని కోల్పోయా: రేవంత్‌

హైదరాబాద్‌ సిటీ, యాదాద్రి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాధనే లక్ష్యంగా యువతను సంఘటితం చేసి మలి దశ ఉద్యమంలో క్రియాశీల ప్రాత పోషించిన జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కన్నుమూశారు. ఏ పార్టీలో ఉన్నా.. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం సాగించిన ఆయన బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. అస్వస్థతకు గురవడంతో జూలై 22న బాలకృష్ణారెడ్డి సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చేరారు. మధ్యలో ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించారు. కానీ, ఇన్‌ఫెక్షన్లు, పలు అవయవాల పనితీరు దెబ్బతినడంతో పరిస్థితి విషమించింది.


ఎన్ని ప్రయత్నాలు చేసినా చికిత్సకు బాలకృష్ణారెడ్డి శరీరం సహకరించలేదు. ఆరోగ్యం విషమించడంతో రెండు రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచారు. శుక్రవారం ఉదయం లామా (ఔ్ఛ్చఠిజీుఽజ ్చజ్చజీుఽట్ట ఝ్ఛఛీజీఛ్చిజూ ్చఛీఠిజీఛ్ఛి)పై బాలకృష్ణారెడ్డిని కుటుంబ సభ్యుల తోడుగా ఇంటికి పంపించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పుట్టిన గడ్డపైనే తుది శ్వాస వదలాలనే బాలకృష్ణారెడ్డి కోరిక మేరకు భువనగిరికి తీసుకొచ్చారు. అమరుల స్తూపం వద్ద కొంతసేపు ఉంచాక కిలోమీటరు దూరంలో మగ్దుంపల్లిలో ఉన్న బాలకృష్ణారెడ్డి ఫామ్‌హౌ్‌సకు తీసుకెళ్లారు. అభిమానుల సందర్శన కోసం 4 గంటల పాటు భౌతిక కాయాన్ని ఉంచారు. స్వగ్రామం భువనగిరి మండలం బొమ్మాయిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.


  • సామాజిక సేవకు కదిలి.. యువతను ఏకం చేసి

భువనగిరి జిల్లాలో తెలంగాణ మలి దశ ఉద్యమమంటే గుర్తుకొచ్చేది జిట్టా బాలకృష్ణారెడ్డి. తన ఆశ, ఆశయం, ఆకాంక్ష తెలంగాణనే అంటూ అనేక సంఘాలను ఏకతాటిపైకి తెచ్చారు. తెలంగాణ సంప్రదాయ, సంస్కృతికి అద్దంపట్టేలా భువనగిరిలో కార్యక్రమాలు నిర్వహించారు. యువతను చైతన్యపరిచి ఆరోగ్య శిబిరాలు, గ్రామీణ క్రీడలు, శ్రమదానాలు, రక్తదానాలను ప్రోత్సహించారు.


డాక్టర్‌ చిలుముల రాంచంద్రారెడ్డి ఫౌండేషన్‌ సాయంతో 2003లో రూ.1.20 కోట్లతో భువనగిరిలో అమ్మమ్మ, తాతయ్యలు చిలుముల శివరాజిని, నారాయణరెడ్డి పేరిట ప్రభుత్వ కళాశాలను నిర్మించారు. 106 గ్రామాల్లో రూ.3.50 కోట్లతో వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఎయిమ్స్‌ స్థాపన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌లో నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్‌ యూత్‌ అవార్డు అందుకున్నారు. 2005లో మూసీ పరిరక్షణ యాత్ర చేపట్టారు. 1998లో రంగారెడ్డి జిల్లా యువజన, 1999లో హైదరాబాద్‌ జూనియర్‌ చాంబర్స్‌ సామాజిక సేవ, 2005లో భారత ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ యువజన సేవా పురస్కారం అందుకున్నారు.


  • కన్నీరుమున్నీరైన అభిమానులు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, విప్‌ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేల్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ కీలక నేతలు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీ్‌షరెడ్డి, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు జిట్టా భౌతిక కాయానికి నివాళులర్పించారు. భువనగిరిలోని అమర వీరుల స్తూపం వద్ద జిట్టాను చూడగానే అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. ఫాంహౌ్‌సకు భారీ ర్యాలీగా వెళ్లారు. జిట్టా చేపట్టిన ఉద్యమాలను గుర్తుచేస్తూ కళాకారులు పాటలు పాడారు.


  • సీఎం రేవంత్‌, దత్తాత్రేయ దిగ్ర్భాంతి

జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. యువతను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని, ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి యువకుడు, జాతీయ భావాలున్న నాయకుడని, సమాజ సేవకు అంకితభావంతో పనిచేశారని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.


  • 20 ఏళ్ల వయసులోనే.. మేనమామ ప్రోద్బలంతో

బొమ్మాయిపల్లిలో రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు బాల్‌రెడ్డి, రాధమ్మ దంపతులకు 1972లో మొదటి సంతానంగా జన్మించారు బాలకృష్ణారెడ్డి. 1993లో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ డీవీఎం కళాశాల నుంచి బీకాం పూర్తి చేశారు. అమెరికాలో ఉండే మేనమామ డాక్టర్‌ చిలుముల రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో 1992లో వివేకానంద యువజన సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా బాలకృష్ణారెడ్డి ప్రస్థానం మొదలుపెట్టారు. యువజన సంఘాల సమితి రాష్ట్ర, నార్త్‌ అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2003లో టీఆర్‌ఎ్‌సలో చేరి 2007లో ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.


2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో భువనగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఆయన హఠాన్మరణం తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక ధోరణి నచ్చక బయటకు వచ్చారు. 2010లో యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. 2022లో దానిని బీజేపీలో విలీనం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. నిరుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రె్‌సలో చేరారు. నెల రోజులలోనే బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లారు. ఎన్నికల ప్రచార సభలో జిట్టా అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన కోలుకుని బీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, జిట్టా బాలకృష్ణారెడ్డికి భార్య సునీత, కుమారుడు వివేకానందరెడ్డి, కుమార్తె ఝాన్సీ ఉన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 05:01 AM