Share News

TS Assembly: బీసీ కుల గణనపై నేడు అసెంబ్లీలో తీర్మానం

ABN , Publish Date - Feb 16 , 2024 | 08:02 AM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా ప్రభుత్వం బీసీ కుల గణనపై తీర్మానం ప్రవేశ పెట్టనుంది. దీనిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు.

TS Assembly: బీసీ కుల గణనపై నేడు అసెంబ్లీలో తీర్మానం

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా ప్రభుత్వం బీసీ కుల గణనపై తీర్మానం ప్రవేశ పెట్టనుంది. దీనిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుంది. దీనిపై సభలో స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. ఇరిగేషన్‌పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశముంది.

కాగా నిన్న (గురువారం) సభలో కాగ్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగ్ రిపోర్టులో సయితం కాలేశ్వరంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగినట్లు కాగ్ ప్రస్తావించింది. ఈరోజు ఇరిగేషన్ చర్చలో ప్రధాన అస్త్రంగా కాగ్ రిపోర్ట్ మారనుంది. మేడిగడ్డ కుంగిన విధానంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనుంది. కాగా ఈ రోజుతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.

Updated Date - Feb 16 , 2024 | 05:42 PM