Minister Tummala:అధిక సాంద్రత పత్తి సాగుపై రైతులు దృష్టిపెట్టాలి
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:40 AM
రైతులు అధిక సాంద్రత పత్తిసాగుపై దృష్టి సారించాలని, ఎరువులు, పురుగుల మందుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు.

ఈ నెలాఖరుకు 456 మండలాల్లో వీసీ యూనిట్లు: తుమ్మల
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): రైతులు అధిక సాంద్రత పత్తిసాగుపై దృష్టి సారించాలని, ఎరువులు, పురుగుల మందుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. అధిక సాంద్రత పత్తి, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు సూచనలు చేశారు. అధిక సాంద్రత పత్తిసాగుతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని చెప్పారు. రైతులకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేశామని, ఇతర రాష్ట్రాల నుంచి అదనపు విత్తనాలు కూడా తెప్పించి అందుబాటులో ఉంచామని తెలిపారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.