Share News

Hyderabad: పొద్దున్నే మద్యం మత్తులో యువతీ యువకుడు హల్‌చల్‌.. సీన్ కట్ చేస్తే..!!

ABN , Publish Date - May 25 , 2024 | 08:54 AM

పొద్దున్నే బీరు తాగుతూ ఓ యువతీ యువకులు నాగోల్‌ పీఎస్‌ పరిధి లోని మత్తుగూడ దారిలో హల్‌చల్‌ చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లే సీనియర్‌ సిటిజన్లతో వాగ్వాదానికి దిగడంతో..

Hyderabad: పొద్దున్నే మద్యం మత్తులో యువతీ యువకుడు హల్‌చల్‌.. సీన్ కట్ చేస్తే..!!

హైదరాబాద్, కొత్తపేట, మే 25: పొద్దున్నే బీరు తాగుతూ ఓ యువతీ యువకులు నాగోల్‌ పీఎస్‌ పరిధి లోని మత్తుగూడ దారిలో హల్‌చల్‌ చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లే సీనియర్‌ సిటిజన్లతో వాగ్వాదానికి దిగడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగోల్‌ పోలీసులు యువతీ యువకుడిని అరెస్ట్‌ చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. బండ్లగూడ నుంచి మత్తుగూడ వెళ్లే దారిలో సీనియర్‌ సిటిజన్లు, ఇతరులు వాకింగ్‌ చేస్తున్న చోటికి ఓ యువకుడు, యువతి కారులో వచ్చి బీరు తాగడం మొదలుపెట్టారు. కాసేపటికి యువతి సిగరెట్‌ తాగుతుండగా సీనియర్‌ సిటిజన్లు వారిస్తూ ఇక్కడ తాగరాదనీ వెళ్లిపొమ్మని సూచించారు. దీంతో రెచ్చిపోయిన యువతి తీవ్ర పదజాలంతో వారితో వాగ్వాదానికి దిగింది. యువకుడు సైతం వత్తాసు పలికాడు.


Young-Women-And-Men.jpg

ఇలా దొరికిపోయారు!

ఈ ఘటనను ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండగా వారిద్దరూ అతడితోనూ గొడవపెట్టుకునేందుకు యత్నించారు. ఎవరినైనా డిస్టర్బ్‌ చేశామా, ఈ చోటు మీదా అంటూ యువతీ వాకర్స్‌ పైకి దూసుకొస్తుండగా యువకుడు ఆమెను వారించాడు. వాకర్స్‌ బలవంతంగా వారిని కారులోకి ఎక్కించి వెళ్లిపొమ్మన్నారు. యువతి కారును వేగంగా నడపగా యువకుడు బీరు బాటిల్‌ను రోడ్డుపైకి విసిరేశాడు. గత కొన్నాళ్లుగా తరచూ వారిద్దరూ ఈ ప్రాంతానికి వచ్చి, బీరు తాగి వెళుతున్నట్లు వాకర్స్‌ పేర్కొంటున్నారు. ఈ విషయంపై నాగోల్‌ పోలీసులకు వాకర్స్‌ ఫిర్యాదు చేశారు. వీడియో క్లిప్‌ కూడా పోలీసులకు పంపినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. పీర్జాదిగూడకు చెందిన అలెక్స బోడిచెర్ల(25), తార్నాకకు చెందిన ఓ యువతి (25) ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లని గుర్తించారు.

Updated Date - May 25 , 2024 | 08:57 AM