Share News

Marijuana: బస్సులలో పెద్ద ఎత్తున బయటపడిన గంజాయి..

ABN , Publish Date - Jan 11 , 2024 | 08:42 AM

హైదరాబాద్: బస్సులలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పెద్ద ఎత్తున బయటపడింది. విధుల్లో భాగంగా ఎక్సైజ్ అధికారులు అర్ధరాత్రి బస్సులను తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు రవాణా అవుతున్న గంజాయి పట్టుబడింది.

Marijuana: బస్సులలో పెద్ద ఎత్తున బయటపడిన గంజాయి..

హైదరాబాద్: బస్సులలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పెద్ద ఎత్తున బయటపడింది. విధుల్లో భాగంగా ఎక్సైజ్ అధికారులు అర్ధరాత్రి బస్సులను తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు రవాణా అవుతున్న గంజాయి పట్టుబడింది. గంజాయి తీసుకొస్తున్న వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.

అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద విజయవాడ జతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మూడు బస్సులో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకునారు. ఏజెన్సీ ఏరియాల నుంచి బస్సుల ద్వారా స్మగ్లర్లు నగరానికి గంజాయి తరలిస్తున్నారు.

Updated Date - Jan 11 , 2024 | 08:42 AM