Share News

Cannabis chocolates: రంగారెడ్డి, నార్సింగిలో గంజాయి చాక్లెట్ల కలకలం..

ABN , Publish Date - Jan 30 , 2024 | 07:31 AM

రంగారెడ్డి జిల్లా: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. కోకపెట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒడిస్సాకు చెందిన సోమ్యా రాజన్‌గా గుర్తించారు.

Cannabis chocolates: రంగారెడ్డి,  నార్సింగిలో గంజాయి చాక్లెట్ల కలకలం..

రంగారెడ్డి జిల్లా: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. కోకపెట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒడిస్సాకు చెందిన సోమ్యా రాజన్‌గా గుర్తించారు. పక్క సమాచారంతో పట్టుకుని 40 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్టుమెంట్‌లో కార్మికులకు అమ్ముతుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. సోమ్య రాజన్ ఒడిస్సా నుంచి హైదరాబాదుకు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 30 , 2024 | 07:31 AM