Share News

Hyderabad: అయోధ్య రామాలయానికి తలుపులు తయారు చేస్తోంది హైదరాబాద్ వాసులే..

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:21 AM

అయోధ్య రామాలయంలో ఉపయోగించనున్న తలుపులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. బోయినపల్లిలోని అనూరాధ టింబర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వారి ఆధ్వర్యంలో అయోధ్య(Ayodhya)లో వీటిని తయారుచేస్తున్న విషయం తెలిసిందే.

Hyderabad: అయోధ్య రామాలయానికి తలుపులు తయారు చేస్తోంది హైదరాబాద్ వాసులే..

- సిద్ధం చేసిన నగర కార్మికులు

- ఓకే చేసిన టాటా ఎల్‌ఎన్‌టీ

బోయినపల్లి(సికింద్రాబాద్), (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామాలయంలో ఉపయోగించనున్న తలుపులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. బోయినపల్లిలోని అనూరాధ టింబర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వారి ఆధ్వర్యంలో అయోధ్య(Ayodhya)లో వీటిని తయారుచేస్తున్న విషయం తెలిసిందే. అయోధ్య రామాలయం నిర్మాణం చేస్తున్న ఎల్‌ఎన్‌టీ టాటా ఇంజినీరింగ్‌ సంస్థ గురువారం అధికారికంగా తలుపుల పనితీరును పరిశీలించిందని, అంతాబాగానే ఉందని నిర్ధారించినట్లు అనూరాధ టింబర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ అధినేత చదలవాడ శరత్‌బాబు వెల్లడించారు. గత ఏడాది జూన్‌లో 60 మంది కళాకారులతో ఈ పనులు ప్రారంభించామన్నారు. బంగారు తాపడంతో ప్రధాన ద్వారాలు రూపుదిద్దుకున్నాయని, వీటిని రెండురోజుల క్రితం ప్రధాన ద్వారాలకు అమర్చినట్లు తెలిపారు. దీంతో ఆలయం ప్రధాన ద్వారాలతోపాటు గర్భగుడి తలుపులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు శరత్‌బాబు గురువారం వెల్లడించారు.

city2.jpg

Updated Date - Jan 12 , 2024 | 11:21 AM