Share News

Andole: దామోదర చొరవ.. అందోల్‌ నర్సింగ్‌ కళాశాలకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:50 AM

సంగారెడ్డి జిల్లా అందోల్‌లో బీఎస్సీ నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది.

Andole: దామోదర చొరవ.. అందోల్‌ నర్సింగ్‌ కళాశాలకు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అందోల్‌లో బీఎస్సీ నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్థు జీవోను జారీ చేశారు. కాలేజీ నిర్మాణం, యంత్ర పరికరాలు, ఫర్నీచర్‌ కోసం రూ. 43 కోట్ల నిధులను కూడా మంజూరు చేశారు.


కళాశాల ఏర్పాటుకై అత్యవసర ధ్రువీకరణ పత్రంతో పాటు నిరభ్యంతర ధ్రువపత్రాన్ని కూడా జారీ చేశారు. 60 సీట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ కాలేజీ కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటుందని తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 10:06 AM