Share News

Meeseva: మీ సేవ ద్వారా మరో తొమ్మిది సేవలు

ABN , Publish Date - Aug 31 , 2024 | 03:25 AM

ఇప్పటివరకు తహసీల్దారు కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ద్వారా అందుతున్న 9 రకాల సేవలను ఇక నుంచి మీ సేవ ద్వారా అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ సీసీఎల్‌ఏ కలెక్టర్లను ఆదేశించింది.

Meeseva: మీ సేవ ద్వారా మరో తొమ్మిది సేవలు

  • ఎమ్మార్వో దాకా వెళ్లకుండానే పలు ధ్రువపత్రాల జారీ

ఇప్పటివరకు తహసీల్దారు కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ద్వారా అందుతున్న 9 రకాల సేవలను ఇక నుంచి మీ సేవ ద్వారా అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ సీసీఎల్‌ఏ కలెక్టర్లను ఆదేశించింది. ఇందులో గ్యాప్‌ సర్టిఫికేట్‌, పౌరుడి పేరు మార్పు, స్థానిక ధ్రువీకరణ పత్రం, మైనార్టీ సర్టిఫికేట్‌, ఆదాయం,


కుల ధ్రువీకరణ పత్రాల జారీ, క్రిమీ లేయర్‌, నాన్‌ క్రిమీలేయర్‌ ధ్రువీకరణ పత్రాలు, మార్కెట్‌ విలువ మీద ధ్రువీకరణ పత్రాలు, రెవెన్యూ రికార్డులకు సంబంధించిన నకల్లు, 1బి రిజిస్టర్‌కు సంబంధించిన నకల్లు ఇక నుంచి మీ సేవ ద్వారా అందించనున్నారు.

Updated Date - Aug 31 , 2024 | 03:25 AM