Share News

GHMC Commissioner: చెరువుల్లో వ్యర్థాలు డంప్‌ చేస్తే క్రిమినల్‌ కేసులు

ABN , Publish Date - Mar 23 , 2024 | 12:46 PM

చెరువుల్లో నిర్మాణ రంగ వ్యర్థాలు డంప్‌ చేస్తోన్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌(GHMC Commissioner Ronaldros) లేక్స్‌ విభాగం అధికారులను ఆదేశించారు.

GHMC Commissioner: చెరువుల్లో వ్యర్థాలు డంప్‌ చేస్తే క్రిమినల్‌ కేసులు

- ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలపై చర్యలు తీసుకోండి

- లేక్స్‌ విభాగం సమీక్షలో రోనాల్డ్‌రోస్‌

హైదరాబాద్‌ సిటీ: చెరువుల్లో నిర్మాణ రంగ వ్యర్థాలు డంప్‌ చేస్తోన్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌(GHMC Commissioner Ronaldros) లేక్స్‌ విభాగం అధికారులను ఆదేశించారు. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌ సరిహద్దులకు సంబంధించిన మ్యాపులను సంబంధిత చెరువు వద్ద ప్రదర్శించాలన్నారు. బుద్ధభవన్‌లోని ఈవీడీఎం కార్యాలయంలో డైరెక్టర్‌ ఎన్‌. ప్రకా్‌షరెడ్డితో కలిసి చెరువుల విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ఎఫ్‌ఎటీఎల్‌, బఫర్‌జోన్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే వెంటనే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీలు ఏర్పాటు చేసి వారితో వాట్సాప్‌గ్రూపులు ఏర్పాటు చేయించి.. చెరువుల ఆక్రమణలకు సంబంధించి మై జీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసేలా చైతన్యవంతం చేయాలన్నారు. చెరువుల చుట్టూ ఫెన్సింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌, మురుగు మళ్లింపు పనులు, సీసీ కెమెరాలు, వీధిదీపాలు, సెక్యురిటీ సిబ్బంది ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందనే ప్రతిపాదనలు రెండు వారాల్లో సమర్పించాలని ఆదేశించారు. జోనల్‌ స్థాయిలో ఒక్కో చెరువును పరిశీలించి రివ్యూ చేయాలని జోనల్‌ కమిషనర్లకు సూచించారు.

Updated Date - Mar 23 , 2024 | 12:46 PM