Share News

Skill University: స్కిల్‌ వర్సిటీలో భవనానికి భూమిపూజ

ABN , Publish Date - Nov 09 , 2024 | 04:21 AM

రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండం మీర్కాన్‌పేటలో మంజూరు చేసిన స్కిల్‌ యూనివర్సిటీలో భవన నిర్మాణాలకు అడుగు పడింది.

Skill University: స్కిల్‌ వర్సిటీలో భవనానికి భూమిపూజ

  • మెయిల్‌ ప్రతినిధులు, వీసీ ఆధ్వర్యంలో కార్యక్రమం

కందుకూరు, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండం మీర్కాన్‌పేటలో మంజూరు చేసిన స్కిల్‌ యూనివర్సిటీలో భవన నిర్మాణాలకు అడుగు పడింది. మీర్కాన్‌పేటలోని 112 సర్వే నంబరులో 57 ఎకరాల్లో యూనివర్సిటీ నిర్మాణానికి ఆగస్టు 1న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్లతో యూనివర్సిటీలో భవనాలను నిర్మించడానికి మెయిల్‌(ఎంఈఐల్‌) సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు శుక్రవారం మెయిల్‌ డైరెక్టర్‌ రవి రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో నెట్‌ జీరో వ్యాలీలో భూమి పూజ చేశారు.


ఈ సందర్భంగా మెయిల్‌ ప్రతినిధులు మాట్లాడారు. తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి తొలి దశ భవన నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఎయిర్‌ కండిషనర్లు లేకుండా ఓపెన్‌ ఎయిర్‌ వ్యవస్థ, చక్కటి వెంటిలేషన్‌తో భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. అకడమిక్‌, అడ్మిషన్‌ బ్లాక్స్‌.. లైబ్రరీ, ఆడిటోరియం, అత్యాధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 04:21 AM