Share News

BRS Vs Congress: రేవంత్ స్థానంలో సీఎంగా భట్టి లేదా ఉత్తమ్ ఉండుంటే..!?

ABN , Publish Date - Apr 20 , 2024 | 07:06 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో భట్టి విక్రమార్క, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా..? ఆ ఇద్దరు నేతలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తన విశ్వరూపం చూపించేదా..? రేవంత్ అంటే ఎందుకు అంత భయం.

BRS Vs Congress: రేవంత్ స్థానంలో సీఎంగా భట్టి లేదా ఉత్తమ్ ఉండుంటే..!?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్థానంలో భట్టి విక్రమార్క, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా..? ఆ ఇద్దరు నేతలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తన విశ్వరూపం చూపించేదా..? రేవంత్ అంటే ఎందుకు అంత భయం. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడదామని బీఆర్ఎస్ పార్టీ అనుకుంది. ఆ ఆశలపై రేవంత్ నీళ్లు చల్లారు. ఉద్యమ పార్టీని అధికారానికి దూరం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఉద్యమ పార్టీని బలహీన పరుస్తున్నారు. రేవంత్ తమ కంటిలో నలుసులా మారాడని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ ప్రభ తగ్గింది. వెంటనే కేసీఆర్ అనారోగ్యానికి గురవడం.. తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ అయ్యారు. అయినా ఫర్లేదు అనుకునే లోపు పార్టీలో ఎమ్మెల్యేలు మెల్లగా జారుకుంటున్నారు. ప్రకాష్ గౌడ్‌తో చేరికల పర్వం కొనసాగుతోంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీ మారారు.

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అనడంతో తేనెతుట్టేను కదిలించినట్టు అయ్యింది. ఆ వెంటనే సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని గట్టి కౌంటర్ ఇచ్చారు. దాంతో కేసీఆర్ సహా అగ్రనేతలు స్పందించని పరిస్థితి. కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడినప్పటికీ గట్టిగా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.


ఒకవేళ రాష్ట్రంలో రేవంత్‌కు కాకుండా ఉత్తమ్, లేదంటే భట్టికి పగ్గాలు ఇస్తే పరిస్థితి మరోలా ఉండేది. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు. గ్రూపులను సమన్వయం చేసుకోవడం, విపక్షాలకు కౌంటర్ ఇవ్వడం వారి వల్ల కాదెమో. ఇదే విషయాన్ని కొందరు ఆనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు. ఆ ఇద్దరు నేతలు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చివరి క్షణం వరకు ప్రయత్నించారు.

ఢిల్లీ వెళ్లి మరి లాబీయింగ్ చేశారు. కానీ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అండదండలు ఉండటంతో ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం ఎక్కువ అని విశ్లేషకులు అంటుంటారు. అలాంటిది రేవంత్ విషయంలో ముఖ్యమంత్రి పదవి కూడా అప్పగించారు. ఇప్పటికి సీఎం పదవితోపాటు పీసీసీ బాధ్యతలను రేవంత్ చూస్తున్నారు.

BJP: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటన

వాస్తవానికి సీఎం పదవి కోసం పోటీ పడ్డ భట్టి విక్రమార్క చాలా కష్ట పడ్డారు. రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేపట్టారు. జనంలో తిరిగి, సమస్యలను తెలుసుకున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సీఎం పదవి వరిస్తుందని అంతా అనుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన శక్తి మేరకు ట్రై చేశారు. గాంధీ కుటుంబంతో సన్నిహిత సబంధాలు, పీసీసీ చీఫ్ గా చేయడంతో ఆయన కూడా రేసులో ఉన్నారు.

ఆ ఇద్దరికీ మాత్రం హై కమాండ్ బాధ్యతలు అప్పగించలేదు. ఒకవేళ ఇస్తే వారిద్దరూ రేవంత్ రెడ్డి స్థాయిలో ధీటుగా ఎదుర్కొనేవారు కాదెమో అని ఆనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడుకునేదని చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్‌కు పగ్గాలు అప్పగించి మంచి పని చేసిందని విశ్లేషిస్తున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 07:57 PM