Share News

Balu Naik: గిరిజనులూ బీఆర్‌ఎస్‌ వలలో చిక్కొద్దు

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:48 AM

కొడంగల్‌ పారిశ్రామికవాడ కోసం తీసుకునే భూమిలో 11 శాతం మాత్రమే గిరిజనులదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బాలూ నాయక్‌ అన్నారు. ఆ భూమికి మెరుగైన పరిహారంతో పాటుగా ఉద్యోగాలూ ఇస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

Balu Naik: గిరిజనులూ బీఆర్‌ఎస్‌ వలలో చిక్కొద్దు

  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బాలూ నాయక్‌

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కొడంగల్‌ పారిశ్రామికవాడ కోసం తీసుకునే భూమిలో 11 శాతం మాత్రమే గిరిజనులదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బాలూ నాయక్‌ అన్నారు. ఆ భూమికి మెరుగైన పరిహారంతో పాటుగా ఉద్యోగాలూ ఇస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కొడంగల్‌ లాంటి వెనుకబడిన ప్రాంతానికి పారిశ్రామికవాడను తీసుకొచ్చి అక్కడున్న దళిత, గిరిజన బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే కేటీఆర్‌ ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు.


సీఎం రేవంత్‌రెడ్డి పైన అక్కసుతోనే ఆయన ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ వలలో చిక్కుకోవద్దని గిరిజనులకు హితవు పలికారు. మానుకోటలో జగన్‌ను తరిమేశామని అంటున్న కేటీఆర్‌.. అదే జగన్‌కు ప్రగతిభవన్‌లో విందులు ఇవ్వలేదా అంటూ బాలూ నాయక్‌ నిలదీశారు.

Updated Date - Nov 26 , 2024 | 03:48 AM